ఆషామాషీ - ఏదో ఊసుపోక చెప్తున్నా!

కింద పదాలు "పదే పదే" చదవండి "మరల మరల" "మళ్ళీ మళ్ళీ"...

తినతగినవి- తినతగనివి మీకేం అనిపించింది కాస్త తికమక పడ్డారా రెండూ ఒక రకంగానే అనుంటారు కదా, ఎంచేతంటే రెంటికీ ఉన్న బేధం చాలా చిన్నది, కనపడనంత, రెండూ ఒక రకమే అనుకునేంత- అవును కదా!

అందువల్లే అనుకుంటా, మనకు ఏం తినొచ్చో ఏం తినకూడదో అనే సంగతే పట్టించుకొమ్, అన్నీ తినేస్తున్నాం.ఇప్పుడు పై రెండు పదాలకు ఉన్న కొద్దిపాటి తేడా తెలిసిందికదా;

తేడా చాలా “కొద్దిపాటిదే”,కానీ కనిపెట్టకపోతే కొంపముంచేస్తుంది మన ఒళ్ళు “లావుపాటిగా”-అడ్డమైనవన్నీతినేస్తే.

ఇక నుంచైనా ఏదైనా తినేముందు-అది తినతగినవా- తినతగనివా అని కొంచెం ఆలోచించుకొని తింటూ ఉండండే! మా ఒళ్ళు మా ఇష్టం,మోసేది మేం కదా- నీకేంటి అంటారా- సరే అలాగ్గానివ్వండి!

మీకూ-భూదేవికి లేని భారం నాకెందుకు!

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!